10
నిబంధన పై సంతకాలు
ముద్రలు వేసినవారు ఎవరంటే, హకల్యా కొడుకు, అధికారి అయిన నెహెమ్యా. ముద్రలు వేసిన యాజకులు సిద్కీయా, శెరాయా, అజర్యా, యిర్మీయా, పషూరు, అమర్యా, మల్కీయా, హట్టూషు, షెబన్యా, మల్లూకు, హారిము, మెరేమోతు, ఓబద్యా, దానియేలు, గిన్నెతోను, బారూకు, మెషుల్లాము, అబీయా, మీయామిను, మయజ్యా, బిల్గయి, షెమయా. వీరంతా యాజక ధర్మం నిర్వహించేవారు.
లేవీ గోత్రికుల నుండి అజన్యా మనవడు యేషూవ హేనాదాదు కొడుకులు బిన్నూయి, కద్మీయేలు, 10 వారి బంధువులు షెబన్యా, హోదీయా, కెలీటా, పెలాయా, హానాను, 11 మీకా, రెహోబు, హషబ్యా, 12 జక్కూరు, షేరేబ్యా, షెబన్యా, 13 హోదీయా, బానీ, బెనీను అనేవాళ్ళు. 14 ప్రజల్లో ప్రధానుల నుండి పరోషు, పహత్మోయాబు, ఏలాము, జత్తూ, బానీ, 15 బున్నీ, అజ్గాదు, బేబై, 16 అదోనీయా, బిగ్వయి, ఆదీను, 17 అటేరు, హిజ్కియా, అజ్జూరు, 18 హోదీయా, హాషుము, బేజయి, 19 హారీపు, అనాతోతు, నేబైమగ్పీ, 20 యాషు, మెషుల్లాము, హెజీరు, 21 మెషేజ, బెయేలు, సాదోకు, యద్దూవ, 22 పెలట్యా, హానాను, అనాయా, 23 హోషేయ, హనన్యా, హష్షూబు, హల్లోహేషు, పిల్హా, షోబేకు, 24 రెహూము, హషబ్నా, మయశేయా, 25 అహీయా, హానాను, ఆనాను, 26 మల్లూకు, హారిము, బయనా అనేవాళ్ళు.
27 ప్రజల్లో మిగిలినవారు, అంటే దేవుని ధర్మశాస్త్రానికి విధేయత చూపుతూ అన్యులతో కలవకుండా తమను తాము ప్రత్యేకపరుచుకొన్న యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, దేవాలయంలో సేవ చేసేవారంతా, 28 దేవుని సేవకుడైన మోషే నియమించిన దేవుని ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకొంటూ, ప్రభువైన యెహోవా నిబంధనలు, కట్టడలు ఆచరిస్తామని శపథం చేసి ఒట్టు పెట్టుకోవడానికి సమకూడారు.
29 వారితోపాటు వారి భార్యలు, కొడుకులు, కూతుళ్ళు, తెలివితేటలున్న వారంతా తమ బంధువులతో ఏకమయ్యారు. 30 మేము అన్య దేశాల ప్రజలకు మా కూతుళ్ళను, వాళ్ళ కూతుళ్ళను మా కొడుకులకు ఇచ్చి పుచ్చుకోమని ప్రమాణం చేశాం. 31 అన్య దేశాల ప్రజలు విశ్రాంతి దినానగానీ, పరిశుద్ధ దినానగానీ అమ్మే వస్తువులను, భోజన పదార్ధాలను కొనుక్కోమనీ, ఏడవ సంవత్సరంలో భూమిని సేద్యం చేయకుండా విడిచిపెడతామనీ ఆ సంవత్సరంలో మాకు రుణ పడి ఉన్నవారి బాకీలు మాఫీ చేస్తామనీ నిర్ణయించుకొన్నాం.
32 ఇంకా మన దేవుని మందిరపు సేవ కోసం ప్రతి ఏడూ తులం వెండిలో* 10:32 తులం వెండిలో 4 గ్రాములు మూడవ వంతు ఇస్తామని తీర్మానం చేసుకొన్నాం. 33 బల్లమీద పెట్టే రొట్టె విషయంలో, నిత్యమూ కొనసాగే నైవేద్యం విషయంలో, దహన బలి విషయంలో, విశ్రాంతి దినం ఆచరించే విషయంలో, అమావాస్యల విషయంలో, నియామక పండగల విషయంలో, ప్రతిష్ట అయిన వస్తువుల విషయంలో, ఇశ్రాయేలీయుల ప్రాయశ్చిత్త పాప పరిహారార్థ బలుల విషయంలో, మన దేవుని మందిరపు పని అంతటి విషయంలో ఆ విధంగా నడుచుకొంటామని నిర్ణయం తీసుకున్నాం.
34 ఇంకా, మా పూర్వీకుల వంశాచారం ప్రకారం ప్రతి ఏడూ నిర్ణయించిన సమయాల్లో ధర్మశాస్త్ర గ్రంథంలో రాసినట్టు దేవుడైన యెహోవా బలిపీఠంపై దహించడానికి దేవుని మందిరానికి కట్టెలు, అర్పణలు యాజకుల నుండి, లేవీయుల నుండి, ప్రజలనుండి ఎవరెవరు తీసుకు రావాలో చీట్లు వేసి నిర్ణయించుకొన్నాం. 35 మా భూమి సాగు నుండి, సకల వృక్షాల నుండి ఫలాలూ ప్రథమ ఫలాలూ ప్రతి సంవత్సరమూ ప్రభువు మందిరానికి తీసుకురావాలని నిర్ణయించున్నాం.
36 ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్నట్టు మా కొడుకుల్లో మొదటి వారిని, మా పశువుల్లో, మందల్లో తొలిచూలు పిల్లలను మన దేవుని మందిరంలో పరిచర్య చేసే యాజకుల దగ్గరికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాం.
37 అంతేకాక, మా పిండిలో ప్రథమ ఫలం, ప్రతిష్టితమైన అర్పణలు, అన్ని రకాల చెట్ల పళ్ళూ, ద్రాక్షారసం, నూనె మొదలైనవాటిని మా దేవుని మందిరపు గదుల్లోకి యాజకుల దగ్గరికి తీసుకురావాలనీ, మా భూమి సాగులో పదవ వంతు లేవీయుల దగ్గరికి తీసుకురావాలనీ, అన్ని పట్టణాల్లో ఉన్న మా పంట సాగులో పదవ భాగాన్ని లేవీయులకు ఇవ్వాలనీ నిర్ణయించుకున్నాం.
38 లేవీయులు పదవ వంతును తెచ్చినప్పుడు అహరోను సంతానం వాడైన ఒక యాజకుడు వారితో ఉండాలనీ, పదోవంతులో ఒక వంతు దేవుని మందిరంలో ఉన్న ఖజానాలో జమ చేయాలనీ నిర్ణయించుకొన్నాం.
39 ఇశ్రాయేలీయులు, లేవీయులు ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె తెచ్చినప్పుడు పరిచర్య చేసే యాజకులు, ద్వార పాలకులు, గాయకులు వాటిని తీసుకు పవిత్ర పాత్రలను ఉంచే ఆలయం గదుల్లో ఉంచాలి. మా దేవుని మందిరం పనులను నిర్ల్యక్ష్యం చేయకూడదని నిర్ణయించుకున్నాం.

*10:32 10:32 తులం వెండిలో 4 గ్రాములు