3
తన కొడుకు అబ్షాలోము నుంచి తాను పారిపోయినప్పుడు రచించినది. దావీదు కీర్తన.
1 యెహోవా, నాకు శత్రువులు ఎంతోమంది! చాలా మంది నా మీద దాడి చేశారు.
2 దేవుని నుంచి అతనికి ఏ సహాయమూ లేదు అని ఎందరో నా గురించి అంటున్నారు.
సెలా.
3 కాని యెహోవా, నువ్వే నాకు డాలు, నువ్వే నాకు మహిమ, నా తల ఎత్తేవాడివి.
4 నేను యెహోవాకు నా స్వరమెత్తినప్పుడు, ఆయన తన పవిత్ర పర్వతం నుండి నాకు జవాబిస్తాడు.
సెలా.
5 నేను పడుకుని నిద్రపోయాను. యెహోవా నాకు క్షేమం ఇచ్చాడు గనక మేల్కొన్నాను.
6 అన్ని వైపులనుంచి వచ్చి నాకు విరోధంగా మొహరించిన గుంపులకు నేను భయపడను.
7 యెహోవా, లేచి రా. నా దేవా, నన్ను రక్షించు. నువ్వు నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొడతావు. దుర్మార్గుల పళ్లు విరగ్గొడతావు.
8 రక్షణ* 3:8 రక్షణ విజయం యెహోవా నుంచి వస్తుంది. నీ ప్రజల మీద నీ ఆశీర్వాదం ఉండు గాక.
సెలా.